కావలసిన పదార్థాలు : మెంతి ఆకులు... గుప్పెడు చింతపండు... నిమ్మకాయంత ఉప్పు... సరిపడా పసుపు... చిటికెడు పచ్చిమిర్చి... 4 ఉల్లిపాయ... చిన్నది ఒకటి ఎండు మిర్చి... 3 ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు... ఒక టీస్పూన్ కరివేపాకు... కొద్దిగా వెల్లుల్లి... రెండు రేకలు నూనె... రెండు టీ స్పూన్స్
తయారీ విధానం : ఒక లీటరు నీటిలో చింతపండు, మెంతి ఆకులు, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరిగించి దించాలి. బాణలిలో నూనె వేసి పైన చెప్పిన పోపు సామగ్రి అంతా వేయించి చారులో కలపాలి. అంతే మెంతి ఆకుల చారు రెండీ. ఈ మెంతి ఆకుల చారు మధుమేహ (షుగర్) వ్యాధి ఉన్న వారికి చాలా మంచిది.