కావలసిన పదార్థాలు : దోసకాయలు... అర కిలో పచ్చిమిర్చి... ఆరు వెల్లుల్లి... 2 రెబ్బలు ఎండుమిర్చి... రెండు పోపుగింజలు... సరిపడా నూనె... 25 గ్రా ఉప్పు... సరిపడా
తయారీ విధానం : దోసకాయల పై చెక్కుతీసి చేదులేకుండా చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి వేరే ప్లేటులోకి ముక్కలుగా తరిగి తీసుకోవాలి. నూనె కాచి వెల్లుల్లి ఎండుమిర్చి పోపుగింజలు కరివేపాకూ వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి కూడా వేసి ఆ వెనకే దోసముక్కల్ని అందులో పోసి మూత పెట్టాలి. ముక్క బాగా మెత్తబడ్డాక ఉప్పు చల్లుకుని కలిపి దింపుకోవాలి. అంతే దోసకాయ కూర రెడీ. ఇది చపాతీల్లోకి బాగుంటుంది.