మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » శాకాహారం » తియ్యిటి పెరుగుతో ఘుమఘుమలాడే "బెండ రైతా" (Vegetarian Food | Ladies Fingers | Curd | Chilli Powder | Cumin Powder | Coriander | Salt | Sugar)
Feedback Print Bookmark and Share
 
Benda Raita
FILE
కావలసిన పదార్థాలు :
బెండకాయలు... ఐదు
పెరుగు... ఒక కప్పు
కారం... పావు టీ.
వేయించిన జీలకర్ర పొడి... పావు టీ.
కొత్తిమీర... కొద్దిగా
ఉప్పు... తగినంత
చక్కెర... తగినంత

తయారీ విధానం :
బెండకాయల చివర్లు తీసేసి రెండు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వీటిని నూనెలో వేయించి న్యూస్ పేపర్ మీద వేసి, నూనె పీల్చుకున్న తరువాత తీసి పక్కన ఉంచాలి. ఈలోపు పెరుగును చిలక్కొట్టి దానికి కారం, జీరాపొడి, ఉప్పు, చక్కెర చేర్చాలి. ఆ తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి పైన కొత్తిమీరతో అలంకరించి అతిథులకు సర్వ్ చేయాలి. అంతే బెండ రైతా తయార్..! ఈ పదార్థం ఎప్పుడయినా సరే తినేందుకు చాలా రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి మంచిది కూడా...!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.