మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » శాకాహారం » లివర్ సమస్యల నివారణకు "ముల్లంగి వేపుడు" (Vegetarian Food | Radish | Chili Powder | Salt | Oil | Coriander Powder | Cumin Powder)
Feedback Print Bookmark and Share
 
Radish Fry
FILE
కావలసిన పదార్థాలు :
ముల్లంగి... ఐదు
కారం... మూడు టీ.
ఉప్పు... సరిపడా
నూనె... తాలింపుకు సరిపడా
ధనియాలపొడి... ఒక టీ.
జీలకర్ర పొడి... ఒక టీ.

తయారీ విధానం :
ముందుగా ముల్లంగి దుంపలను పొట్టు తీసి సన్నగా తరుక్కోవాలి. తర్వాత ముల్లంగి ముక్కల్ని ఉప్పు నీటిలో కడిగి శుభ్రం చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి నూనె వేడయ్యాక, ముల్లంగి ముక్కలు వేసి తక్కువ మంటలో బాగా వేయించాలి. తరువాత ఈ ముక్కలకు తగినంత ఉప్పు కలిపి వేయించాలి.

ముక్కలు బాగా ఉడికి మెత్తబడ్డాక నూనె ఎక్కువగా ఉంటే వంపి కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి కాసేపు వేయించి దించాలి. అంతే ముల్లంగి వేపుడు రెడీ. దీనిని పొడి పొడిగా ఉండే రైస్‌కు సైడ్‌డిష్‌గా వాడుకుంటే రుచికరంగా ఉంటుంది. దోశె, చపాతీల్లోకి కూడా తీసుకోవచ్చు. లివర్, క్యాన్సర్, దగ్గు, గాల్ బ్లాడర్, గాల్‌స్టోన్, కిడ్నీలో రాళ్లు తదితర సమస్యల నివారణలో ముల్లంగి ఎంతగానో ఉపయోగపడుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.