తయారీ విధానం : కందిపప్పు, బంగాళా దుంపల్ని కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి. స్టౌమీద బాణలి వేడయ్యాక నూనెపోసి తాలింపు వేసి, తాలింపు వేగాక ఉల్లి, పచ్చిమిర్చి తరుగులను వేసి దోరగా వేయించాలి. తర్వాత పుదీనా, కరివేపాకు, ఆలు, గుమ్మడి తరుగులు ఒక్కొక్కటిగా వేసి వేపాలి.
తరువాత ఉప్పు, కారం, టమోటా, గరం మసాలా వేసి కొంచెం నీరు చేర్చి కాసేపు ఉడకనివ్వాలి. పదినిమిషాల తర్వాత దించి ఓ పాత్రలోకి తీసుకుని కొత్తిమీర, మీగడ, కొబ్బరి చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి. ఈ గుమ్మడి పప్పును రైస్‌తో పాటు రోటీలకు సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.