FREE

On the App Store

FREE

On the App Store

'బేబీకార్న్ పులావ్'... 'బేబీ' యు ఆర్ సో టేస్టీ....!

శుక్రవారం, 23 ఆగస్టు 2013 (17:15 IST)

Widgets Magazine

FILE
కావలసిన పదార్థాలు :

బాస్మతి బియ్యం : ఒక కప్పు,
బేబీకార్న్‌లు : పన్నెండు
ఉల్లిపాయ : ఒకటి
కొబ్బరి పాలు (పలచగా) : రెండు కప్పులు
బిర్యానీ ఆకు : ఒకటి
పసుపు : చిటికెడు
దాల్చిన చెక్క : చిన్న ముక్క
లవంగాలు : మూడు
యాలక్కాయలు : రెండు
ఉప్పు : సరిపడా
నూనె లేదా నెయ్యి : మూడు టేబుల్ స్పూన్లు

గుజ్జుకోసం :
కొత్తిమీర కట్టలు : రెండు
వెల్లుల్లి (చిన్నవి) : ఐదు
అల్లం : చిన్న ముక్క
కొబ్బరి తురుము : రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి : నాలుగు
గరం మసాలా పొడి : పావు టీస్పూన్

తయారు చేయు విధానం : బియ్యాన్ని కనీసం అరగంట నానపెట్టాలి. ఉల్లిపాయని నిలువుముక్కలుగా కోసుకోవాలి. బేబీకార్న్‌ను కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒకవేళ బేబీకార్న్‌ను కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒకవేళ బేబీ కార్న్ ను పలుచగా గుండ్రటి ముక్కలుగా కోసుకుంటే కనుక కుక్కర్ లో ఉడికించాల్సిన అవసరం లేదు.

గుజ్జుకోసం కావాల్సిన పదార్ధాలన్నింటినీ మిక్సీలో తక్కువ నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. పులావ్ ను కుక్కర్ లో నేరుగా వండుతుంటే గనుక అందులోనే నూనె వేడిచేసి బిర్యానీఆకు, దాల్చినచెక్క, యాలక్కాయ, లవంగాలను వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగించి బేబీకార్న్, రుబ్బిన మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి.

ఇందులో నానపెట్టిన బియ్యం వేసి ఒక నిమిషం పాటు ఉంచి కొబ్బరి పాలు పోసి ఉడికించాలి. తరువాత ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నటి మంట మీద పదినిమిషాల పాటు విజిల్ పెట్టకుండా ఉడికించాలి. అంతే పులావ్ రెడీ. వేడివేడి పులావ్ ని ఉల్లిపాయ రైతాతో లేదా నచ్చిన ఇంకేదైనా రైతాతో తినొచ్చు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

వంటకాలు

సమ్మర్ స్పెషల్.. చికెన్ మ్యాంగో సాల్సా టేస్ట్ చేయండి.

వేసవిలో లభించే మ్యాంగోతో సాల్సా టేస్ట్ చేయండి. ప్రతి వీకెండ్ ఒకేలా కాకుండా ఈ వీకెండ్ ...

వెయిట్ లాస్‌ కోసం ఓట్ మీల్ ఎగ్ ఆమ్లెట్ తీసుకోండి!

ఓట్స్ అంటేనే వెయిట్ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అందరికీ బాగా తెలుసు. ఓట్స్‌లో ...

పాలక్‌ చికెన్‌ను ఎలా తయారు చేస్తారు?

ముందుగా అనువైన ముక్కలతో కట్ చేసుకున్న చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ ...

పనీర్ స్టిక్స్ ఎలా చేయాలో తెలుసా!?

కావలసిన పదార్థాలు :పనీర్ : 200 గ్రాములు పచ్చిమిర్చి తురుము : ఒక టేబుల్‌ స్పూను. ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుంటుందా...?

తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుంటుందా...! ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబయిలో ...

స్పెషల్ స్టేటస్ నిల్... బాబుతో వేస్ట్... కేసీఆర్ తో బెస్ట్... భాజపా ఫార్ములా ఇదేనా...?

ఆశించిన ప్రకటన రాకపోవడంతో ఏపీ భంగపడింది. బడ్జెట్ 2015-16లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాపై ...

లేటెస్ట్

గ్రాండ్‌గా రెగ్యుల‌ర్ షూటింగ్‌లో మాస్‌మ‌హ‌రాజ్‌ ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్‌'

బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల త‌రువాత మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, మిల్కీ బ్యూటి ...

నా పర్మిషన్ తప్పనిసరి.. ఇళయరాజా ఆగ్రహం..!

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరచిన పాటలు ఉన్నాయంటే ఆ సినిమా హిట్టు తప్పనిసరి. అంతటి స్థాయిలో ...

Widgets Magazine
Widgets Magazine

ఇంకా చదవండి

రాత్రి 7 గంటలకు విశాఖ పోర్ట్ స్టేడియంలో కందుల సిస్టర్స్ భరత నాట్యం..

Kandula sisters

కందుల షాలిని, కందుల జాబిలి పేర్లు చెబితే చటుక్కున గుర్తుకు వచ్చేది భరతనాట్యం. ఈ ఇద్దరు సోదరీమణులు ...

3-12 నెలల మధ్య పిల్లలకు ఈ ఫుడ్ పెట్టకండి!

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఈ ...

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి!

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి అంటున్నారు న్యూట్రీషన్లు. ఆకలితో పస్తులున్నప్పుడు ...

Widgets Magazine
Widgets Magazine