ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > వార్తలు > చిరు పార్టీ జెండా ఆవిష్కరణ...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిరు పార్టీ జెండా ఆవిష్కరణ...
మెగాస్టార్ చిరంజీవి తన పార్టీ జెండాను వికలాంగుల చేత ఆవిష్కరింప జేశారు. పై భాగంలో తెలుపు.. కింది భాగంలో ఆకుపచ్చ, మధ్యలో నిండు సూర్యుడు. ప్రకృతి, పచ్చటి పొలాల్లో నిలబడి సూర్యోదాన్ని చూస్తుంటే.. ప్రతి రోజూ దాని ప్రేమిస్తాం. సూర్యుడు ఈ జగతికి, ప్రకృతికి సూర్య ప్రదాత, శక్తి ప్రదాత. జంతు, వృక్ష, మానవాళికి శక్తిని ప్రసాదిస్తుంటాడు. సూర్య కిరణాలు.. 24.

రోజుకు 24 గంటలు. కార్యకర్తల నుంచి ప్రధాన సేవకుడైన నా వరకు.. నలు దిశలా, ప్రతి మారుమూల గ్రామానికి వెళ్లి.. సమస్యలు తెలుసుకుని గ్వామ స్వరాజ్యం కోసం పాటుపడుదాం. అలాగే.. ఎరుపు రంగు. ఎరుపు రంగు.. విప్లవం... మార్పుకు చిహ్నం ఎరుపు. తెలుపు.. అది ఒక్క రంగు కాదు. సప్త వర్ణాల మిళితం. ఏ ఒక్కరికో సొంతం కాదు. ఈ సేవకుడు ఒక్కడి వాడుకాదు.. అందరివాడు. అన్ని వర్ణాల వాడు.

పాదర్శకతతో కూడిన పరిపాలనకు ప్రతీక. ఇకపోతే.. పచ్చదనం సస్యశ్యామలం. అదే లేకపోతే.. జీవనాధారం లేదు. రైతులు... ఇతర పాడి పంటల చేసే వారికి, అన్నదాతలకు గుర్తు ఆకుపచ్చదనం. ఇక సూర్యుడి చుట్టూ ఉన్న పసుపు లైను.. చిరు నవ్వు కావాలి.

ఆ చిరునవ్వు ప్రతి ఇంట్లోను, ప్రతి ముఖంలోనూ కనిపించాలి. ఎరుపు.. హిందూయిజానికి. తెలుపు క్రిస్టియానిటీకి. ఆకుపచ్చ ముస్లింలకు ప్రతీక. అందుకే.. ఈ జెండా అన్ని వర్గాల వారికి చెందింది. మీ జెండా. అంటూ.. చిరంజీవి తన పార్టీ జెండా ప్రత్యేకతను వివరించారు.
మరిన్ని
చిరు పార్టీ.... ప్రజారాజ్యం..
వ్యక్తి స్వామ్యం కాదు... ప్రజాస్వామ్యం
నాయకుడిని కాదు సేవకుడిని :చిరంజీవి  
గంజి నుంచి బెంజి దాకా...  
ఈ జన్మ ధన్యం.. చిరంజీవి
జనసంద్రంలో తిరుపతి