ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > వార్తలు > సనత్‌నగర్ పీఆర్పీ అభ్యర్థిగా వినయ్ ఖరారు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సనత్‌నగర్ పీఆర్పీ అభ్యర్థిగా వినయ్ ఖరారు
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పి.వినయ్ పేరును ఖరారు చేసింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించగా, తాజాగా సనత్‌నగర్‌కు అభ్యర్థిని ప్రజారాజ్యం పార్టీ వెల్లడించింది. ప్రజారాజ్యం పార్టీ అగ్రనేతల్లో ఒకరైన కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత పి.శివశంకర్‌ తనయుడే డాక్టర్‌ పి.వినయ్‌.

ప్రజారాజ్యం వ్యవస్థాపనలో వినయ్ కీలక పాత్ర పోషించారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో మున్నూరు కాపుల ప్రభావం అధికంగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే అభ్యర్థిగా ప్రకటించి, ప్రజారాజ్యం సనత్‌నగర్‌ నియోజకవర్గంలో విజయావకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

ఈ నియోజకవర్గం నుంచి కోపు శ్రీనివాస్‌, ఆకుల విజయ, కట్టెల శ్రీనివాస్ యాదవ్‌ టికెట్‌ను ఆశిస్తుండగా... డాక్టర్‌ వినయ్‌ వైపు పార్టీ మొగ్గుచూపింది. ఇదిలావుండగా శనివారం జిల్లా కన్వీనర్లు వడ్డేటి దేవేందర్‌, దేవుడితో పార్టీ అగ్రనేతలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చిరు ఇమేజీ ఉండగా.. కామన్ సింబలెందుకు!
తెదేపాకు గుత్తా సుఖేందర్ గుడ్‌బై
"పదో చెల్లెమ్మ"తో అన్నయ్యకు తంటాలు!
రాష్ట్రంలో డీకేకు మొండిచేయి: కర్ణాటకలో ఛాన్స్!
నానోకారు ఎన్నికల్లో నాననుంది
సోదర పార్టీల మధ్య పొడచూపిన విభేదాలు