ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > వార్తలు > అన్నయ్యకు ఓ అవకాశం ఇవ్వండి : నాగేందర్‌
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అన్నయ్యకు ఓ అవకాశం ఇవ్వండి : నాగేందర్‌
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజా విజయభేరి సభలో సినీ నటుడు నాగేందర్‌ బాబు అశేష ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని ప్రభుత్వాలు గద్దెదిగక తప్పదని, ప్రజల బాగోగులు చూసే ప్రజారాజ్యం పార్టీకి మద్దతు తెలపాలని నాగబాబు కోరారు.

ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా తాను రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు వెళ్ళినప్పు డు తనకు ఓ విషయం స్పష్టంగా అర్థమైందని నాగబాబు అన్నారు. ప్రజలెవరూ సెజ్‌లు, పరిశ్రమలు కోరుకోవడం లేదని తిండి, కట్టుకునేందుకు బట్ట, జీవించేందుకు జానెడు చోటు కావాలని కోరుకుంటున్నారన్నారు. ఇప్పటి ప్రభుత్వాలు ఆ కనీస అవసరాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.

కృష్ణా-గోదావరి వంటి జీవనదులు ప్రవహిస్తున్నా... రాష్టంలో 2.5 కోట్ల మంది ఇంకా ఒంటి పూటే భోజనం చేస్తూ ఉంటే ఇప్పటివరకూ పాలించిన ప్రభుత్వాలు ఏం చేశాయని నాగబాబు ప్రశ్నించారు. అలాగే విద్య, వైద్యం, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల మాటే లేదని వాపోయారు. ప్రజల కనీస అవసరాలను తీర్చడమే ప్రజారాజ్యం లక్ష్యమని స్పష్టం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కాంగ్రెస్‌ జాబితా: 48 సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతు
లోక్‌సభ ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
కోవూరు నుంచి తుపాకుల మునెమ్మ!
నటి రోజాకు యెర్రవారిపాలెం వాసుల నిరసన!
ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్న ఫెర్నాండెజ్
చంద్రబాబుకు ఎన్టీఆర్ ప్రచారం: పార్వతి ఆక్షేపం