ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > వార్తలు > కాంగ్రెస్ జాబితాలో మార్పులు.. చేర్పులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాంగ్రెస్ జాబితాలో మార్పులు.. చేర్పులు
కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. తొలుత ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులు, చేర్పులు చేసింది. ప్రస్తుత శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కుతూహలమ్మకు ఎట్టకేలకు టిక్కెట్ కేటాయించారు. అలాగే, పెండింగ్‌లో ఉంచిన నాలుగు స్థానాల్లో కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేసింది.

చిత్తూరు జిల్లా వేపంజేరి నియోజకవర్గానికి చెందిన కుతూహలమ్మకు ఆ స్థానం జనరల్ కావడంతో ముందు టిక్కెట్ దక్కలేదు. దీనితో ఆమె ముఖ్యమంత్రిని, పిసిసి చీఫ్‌ను, చివరికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు యత్నించారు. చివరికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సిఎంను కలిసి మరే రిజర్వుడ్ స్థానం నుంచైనా తనకు టిక్కెట్ ఇవ్వని పక్షంలో ఆత్మత్యాగం చేస్తానంటూ బెదరించారు. దీనితో ఆమెకు గంగాధర నెల్లూరు స్థానాన్ని కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

మార్చిన అభ్యర్థుల వివరాలు:
ఎస్.కోట: ఎ.కె.వి.పి నాయుడు
గంగాధర నెల్లూరు (ఎస్సీ): జి. కుతూహలమ్మ
షాద్‌నగర్: ప్రతాపరెడ్డి
చార్మినార్: బుచ్చి దాస్ గౌడ్
కాకినాడ: ఎన్. వెంకటేశ్వరరావు

పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులు:
ఖమ్మం: యూనిస్ సుల్తాన్
దుబ్బాక: చెరుకు ముత్యంరెడ్డి
రాజమండ్రి రూరల్: జక్కంపూడి విజయలక్ష్మి
మిర్యాలగూడ: గంగాధర్.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పాలమూరు స్థానం వద్దని రాములమ్మ అలక!
అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ పోటీ: చిరు
ఆదికేశవులుకు ప్రజారాజ్యం పార్టీ తీర్థం!
నేటి నుంచి యువరాజ్యం "పులి" ప్రచారం
10 సీట్లకు అభ్యర్థుల పేర్లను వెల్లడించిన సీపీఎం
తెరాస నాలుగో జాబితా విడుదల