ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > వార్తలు > 60 మంది పేర్లతో పీఆర్పీ రెండో జాబితా విడుదల
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
60 మంది పేర్లతో పీఆర్పీ రెండో జాబితా విడుదల
ప్రజారాజ్యం పార్టీ 60 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. మలి విడతలో 60 అసెంబ్లీ, 12 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 160 అసెంబ్లీ, 21 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను పీఆర్పీ ఖరారు చేసింది.

ఇక తాజాగా ప్రకటించిన 60 అసెంబ్లీ స్థానాల్లో 21 స్థానాలు బీసీలకు ఇచ్చారు. అలాగే ఎస్సీలకు 12, ఎస్టీలకు 11, ఓసీలకు 14, మైనారిటీలకు 2 స్థానాలను కేటాయించారు. రెండు జాబితాలు కలుపుకుంటే బీసీలకు ఇప్పటి వరకు 69 స్థానాలు దక్కాయి. మహిళలకు తొలి జాబితాలో పది అసెంబ్లీ సీట్లు ఇవ్వగా మలి విడతలో ఏడు స్థానాలు దక్కాయి. ఇక ఎంపీ సీట్లలో బీసీ, ఎస్సీ, ఓసీ, మైనార్టీ వర్గాలకు మూడేసి చొప్పున కేటాయించారు.

లోక్‌సభ అభ్యర్థులు...
పెద్దపల్లి- ఆరేపల్లి డేవిడ్‌ రాజు, నిజామాబాద్‌- డాక్టర్‌ పుంజల వినయ్‌ కుమార్‌, సికింద్రాబాద్‌- డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌, నాగర్‌ కర్నూలు- డి.సతీష్‌ మాదిగ, నల్గొండ- పాదూరి కరుణ, భువనగిరి- గెడ్డం చంద్రమౌళిగౌడ్‌, గుంటూరు- తోట చంద్రశేఖర్‌, నర్సారావుపేట- సయ్యద్‌ సాహెబ్‌, నంద్యాల- భూమా నాగిరెడ్డి, అనంతపురం- జీఎస్‌.మన్సూర్‌, కడప- ఎస్‌.ఎ.ఖలీల్‌బాషా, తిరుపతి- వెలగపల్లి వర ప్రసాద్‌రావు.

అసెంబ్లీ అభ్యర్థులు...

వరంగల్‌..
జనగాం- జల్లి సిద్ధయ్య, స్టేషన్‌ ఘన్‌పూర్‌ (ఎస్సీ)- ఆరూరి రమేష్‌, పాలకుర్తి- ఎన్‌ ప్రవీణ్‌రావు, డోర్నకల్‌ (ఎస్టీ)- సుజాతా మంగీలాల్‌, మహబూబాబాద్‌- డాక్టర్‌ నెహ్రూ నాయక్‌, నర్సంపేట- గోనెల రవీందర్‌, పరకాల- మంద ఐలయ్య, వరంగల్‌ పశ్చిమ- మాదాడి రవీందర్‌రెడ్డి, వరంగల్‌ తూర్పు- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, వర్దన్నపేట- జన్ను జకారియా, ములుగు (ఎస్టీ)- జయరాం నాయక్‌.

హైదరాబాద్‌..
ముషీరాబాద్‌- పీవీ.అశోక్‌, ఖైరతాబాద్‌- సవ్వాడ విజయేంద్ర, గోషా మహల్‌- మాధవి దీపక్‌,
యాకుత్‌పురా- షీరా రాజ్‌ కుమార్‌, బహదూర్‌పురా- సయ్యద్‌ యూనిస్‌ దేశ్‌ముఖ్‌, సికింద్రాబాద్‌- మేకల సారంగపాణి.

ఆదిలాబాద్‌...
సిర్పూర్‌- లెనుగూరి మెంగజీ పటేల్‌, చెన్నూరు (ఎస్సీ), అందుగుల శ్రీనివాస్‌, బెల్లంపల్లి (ఎస్సీ)- అమ్రాజుల శ్రీదేవి, మంచిర్యాల- కర్రె అచ్చన్న, ఆసిఫాబాద్‌ (ఎస్టీ)- ఆడె రమేష్‌, ఖానాపూర్‌ (ఎస్టీ)- భూక్యా చంద్రశేఖర్‌, ఆదిలాబాద్‌- చిలుకూరి తిరుపతి, బోధ్‌ (ఎస్టీ)- డొడసం విజయలక్ష్మి, నిర్మల్‌- ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మధోల్‌- గడ్డం విఠల్‌రెడ్డి.

ఖమ్మం..
పినపాక (ఎస్టీ)- జానకీరామ్‌ తేజావత్‌, ఇల్లెందు (ఎస్టీ)- బానోతు శంకర్‌ నాయక్‌, ఖమ్మం- ఇ.హరిబాబు, పాలేరు- రాయల నాగేశ్వరరావు, మధిర (ఎస్సీ)- డాక్టర్‌ సుఖభోగి విజయవాణి, సత్తుపల్లి- నాగబత్తిన రవి, ఆశ్వారావుపేట (ఎస్టీ)- తాటి నాగేంద్రరావు.

మహబూబ్‌ నగర్‌..
నారాయణ్‌పేట- డాక్టర్‌ సాయిబాబా, వనపర్తి- డాక్టర్‌ భూపేష్‌ ముదిరాజ్‌, గద్వాల- గట్టు భీముడు, అలంపూర్‌ (ఎస్సీ)- సురవ శోభారాణి, నాగర్‌ కర్నూల్‌- డాక్టర్‌ షేక్‌ నూర్జహాన్‌, కల్వకుర్తి- జక్కుల చిత్తరంజన్‌దాస్‌.

మెదక్‌...
సిద్ధిపేట- డాక్టర్‌ బెగ్గలం నర్సింహాచారి, నారాయణఖేడ్‌- మహారెడ్డిగారి విజయపాల్‌రెడ్డి, నర్సాపూర్‌- కైలాస్‌ రాం చంద్రగుప్త, జహీరాబాద్‌- దామస్తపురం వసంత కుమార్‌.

నల్గొండ...
మిర్యాలగూడ- అలుగువెల్లి అమరేందర్‌రెడ్డి, భువనగిరి- పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్‌.

నెల్లూరు...
గూడరు (ఎస్సీ)- మనపాటి రవీంధ్ర, సూళ్లూరుపేట (ఎస్సీ)- గరిక ఈశ్వరమ్మ, కావలి- రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, ఉదయగిరి- సుంకర అంజనాద్రి.

తూర్పు గోదావరి...
రంపచోడవరం (ఎస్టీ)- సీతంశెట్టి వెంకటేశ్వరరావు.

రంగారెడ్డి...
మేడ్చల్‌- తోటకూర జంగయ్య యాదవ్‌, శేరిలింగంపల్లి- బండి రమేష్‌, చేవేళ్ల- డాక్టర్‌ బాలు సావ్ల.

నిజామాబాద్‌...
ఆర్మూర్‌- బత్తం మధుశేఖర్‌, కామారెడ్డి- దాత్రిక్‌ విఠల్‌, నిజామాబాద్‌- డాక్టర్‌ రవీందర్‌రెడ్డి.

కరీంనగర్‌...
వేములవాడ- తీగల రవీంధ్రగౌడ్‌.

విజయనగరం...
కురుపాం (ఎస్టీ)- నిమ్మక జయరాజ్‌, చీపురుపల్లి- రౌతు సునీత.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తెలుగుదేశం నాలుగో జాబితా విడుదల
కాంగ్రెస్ జాబితాలో మార్పులు.. చేర్పులు
పాలమూరు స్థానం వద్దని రాములమ్మ అలక!
అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ పోటీ: చిరు
ఆదికేశవులుకు ప్రజారాజ్యం పార్టీ తీర్థం!
నేటి నుంచి యువరాజ్యం "పులి" ప్రచారం