మహాకూటమిలోని మరో పార్టీ సీపీఐ 14 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ జాబితాను విడుదల చేయడం గమనార్హం. 13 స్థానాలకు తమ అభ్యర్థుల జాబితాను నారాయణ శనివారం విడుదల చేశారు. తెదేపా తమకు కేటాయించిన సీట్ల సంఖ్యపై అసంతృప్తితో ఉన్నామని చెప్పారు.
అయితే కాంగ్రెస్‌ను ఓడించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నందువల్ల తెదేపా ఇచ్చిన స్థానాలకు అంగీకరించినట్టు తెలిపారు. మొదట తాము 21 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలను అడిగామని, 2 పార్లమెంటు 15 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు. కానీ ఒప్పుకున్న స్థానాల సంఖ్య కంటే ఒకటి తక్కువగానే ఇవ్వడం బాధాకరమేనన్నారు.
అభ్యర్థులు వీరే... లోక్‌సభ స్థానాలు: సురవరం సుధాకర్‌రెడ్డి (నల్లగొండ), కె.శ్రీనివాస రావు (మహబూబాబాద్)
అసెంబ్లీ స్థానాలు: కూనంనేని సాంబశివరావు (కొత్తగూడెం), డాక్టర్ చంద్రావతి (వైరా), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), ఉజ్జిని యాదగిరిరావు (మునుగోడు), రమావత్ రవీంద్రకుమార్(దేవరకొండ), చాడ వెంకటరెడ్డి (హుస్నాబాద్), చిలుముల కృష్ణారెడ్డి (నర్సాపూర్), జి.మల్లేష్(బెల్లంపల్లి), కె.సుబ్బరాజు (విజయవాడ పశ్చిమ), జి.దేముడు (పాడేరు), మీర్ అహ్మద్‌అలీ (బహదూర్‌పుర-ఓల్డ్‌సిటీ), ముప్పాళ్ల నాగేశ్వరరావు (మంగళగిరి), కె.రామకృష్ణ (ఆలూరు). అనంతపురం స్థానంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. |