వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > పొత్తు ధర్మానికి విరుద్ధంగా మహాకూటమి
వార్తలు
అధికార కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యాగా ఏర్పాటైన మహాకూటమి పొత్తు ధర్మాన్ని విస్మరించింది. తొలివిడత నామినేషన్ల గడువు గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసినప్పటికీ.. పలు చోట్ల మహాకూటమి అభ్యర్థులు బరిలోనే ఉన్నారు. తెరాస స్థానంలో నామినేషన్లు దాఖలు చేసిన తెదేపా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. అలాగే సీపీఎం పోటీ చేస్తున్న స్థానాల్లోనూ తెదేపా అభ్యర్థులు బరిలో ఉన్నారు.

పెద్దపల్లిలో తెదేపా బీఫారంతో నామినేషన్‌ దాఖలు చేసిన విజయరమణారావు తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు ససేమిరా అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో తెరాస, సీపీఐ అభ్యర్థులు బరిలో ఉన్నారు. శేరిలింగంపల్లి రెబల్‌ అభ్యర్థి శంకర్‌గౌడ్‌ తానే నిజమైన అభ్యర్థిని అని ప్రకటించుకున్నారు.

సిరిసిల్లలోను కేసీఆర్‌ తనయుడు రామారావుకు కూడా రెబల్‌ బెడద తప్పలేదు. తెరాసకు కేటాయించిన మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి, మక్తల్‌లో దయాకర్‌రెడ్డిలు పోటీ నుంచి తప్పుకోలేదు. ముషీరాబాద్‌, పటాన్‌చెరు, స్టేషన్‌ ఘనాపూర్‌, వరంగల్‌ (ఈస్ట్), ములుగు, సంగారెడ్డి, కార్వాన్‌, నర్సంపేట అసెంబ్లీ స్థానాల్లో, వరంగల్‌, సికింద్రబాద్‌ లోక్‌సభ స్థానాల్లో కూటమిలోని రెండు పార్టీలు తలపడుతున్నారు.