రాజంపేట లోక్‌సభ బరిలో డీకే కుమారుడు! | |
కడప జిల్లా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ డి.కె.ఆదికేశవులు నాయుడు కుమారుడు డీఎస్.శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలోకి దిగనున్నారు. ఆయన తండ్రి కూడా పీఆర్పీ తరపున ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలుస్తోంది. కాగా, రెండో దశ ఎన్నికల్లో పీఆర్పీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ గురువారం ప్రకటించింది. వీటిలో 27 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల పేర్లు ఉన్నాయి.
లోక్‌సభ అభ్యర్థులు...
ఒంగోలు.. పిడతల సాయి కల్పనారెడ్డి, విజయవాడ.. చనుమోలు రాజీవ్, రాజంపేట.. డీఏ శ్రీనివాస్.
అసెంబ్లీ స్థానాలు...
హిందూపురం.. పల్లా లక్ష్మీనారాయణ, పుట్టపర్తి.. పసుపులేటి రమణ, ధర్మవరం.. జి.సదాశివరెడ్డి, మైదుకూరు.. తిరుపాల్ రెడ్డి, గుంటూరు (తూర్పు).. షేక్ షౌకత్, గుంటూరు (పశ్చిమ).. తలసీ రామచంద్ర ప్రభు, నందికొట్కూరు.. ఎం.రేణుకమ్మ, ఆదోని.. యు.సలీం, పత్తికొండ.. శ్రీనివాసులు, రాప్తాడు.. కె.కృష్ణమూర్తి, పోలవరం.. బి.శ్రీనివాస్ దొర, నర్సాపురం.. కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉంగుటూరు.. కోటగిరి విద్యాధరరావుల పేర్లు ఉన్నాయి.
అలాగే, పాలకొల్లు.. చిరంజీవి, మండపేట.. వీవీఎస్ చౌదరి, రామచంద్రాపురం.. తోట త్రిమూర్తులు, చిలకలూరిపేట.. పోసాని కృష్ణమురళీ, యరగ్రొండెపాలెం.. జేసుబాబు, మదనపల్లి.. చిన్న వాసుదేవరెడ్డి, గురజాల.. గుర్రం గోపి శ్రీధర్‌రెడ్డి, తెనాలి.. కిలారి రోశయ్య, కోడూరు.. సామినేని సరస్వతి, దర్శి.. మద్దిశెట్టి వేణుగోపాల్, సత్తెనపల్లి.. బైరా దిలీప్ చక్రవర్తి, పొన్నూరు.. తాళ్ల వెంకటేష్ యాదవ్, పులివెందుల.. వి.చిన్నగంగిరెడ్డి, రాయచోటి.. ఎస్.మహబూబ్ బాషాలు ఉన్నారు.