రాజమండ్రి లోక్‌సభ బరిలో రెబల్"స్టార్" వార్ | |
రాజమండ్రి లోక్‌సభ స్థానం ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం నుంచి తెలుగుదేశ పార్టీ తరపున సినీ నటుడు కె.మురళీమోహన్ పోటీ చేస్తుండగా, ప్రజారాజ్యం పార్టీ తరపున రెబల్‌స్టార్ కృష్ణంరాజు పోటీ చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో ఎన్నడూ లేనంతగా పోటీ ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరిన రెబల్‌స్టార్ కృష్ణంరాజు రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.
నర్సాపురం నుంచి రెబల్‌స్టార్ పోటీ చేస్తారని వార్తలు వచ్చినా ఆ స్థానంలో గుబ్బల తమ్మయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. ఏలూరు నుంచి రెడ్డ యాదయ్యను బరిలోకి దింపుతుంది. ఇప్పటికే ఆరు జాబితాలను ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ మరో ఐదు లోక్‌సభ, 24 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఏడో జాబితాను ప్రకటించింది.
లోక్‌సభ అభ్యర్థులు: రాజమండ్రి - కృష్ణంరాజు, నర్సాపురం - గుబ్బల తమ్మయ్య, ఏలూరు- రెడ్డయ్య యాదవ్, కర్నూలు- డాక్టర్ ఖాజాపీర్.
అసెంబ్లీ అభ్యర్థులు: పత్తిపాడు- తోటనవీన్, పిఠాపురం- వంగగీత, కాకినాడ రూరల్- కురుసాల కన్నబాబు, పెద్దాపురం- పంతం గాంధీమోహన్, జగ్గంపేట్- జ్యోతుల నెహ్రూ, అమలాపురం- చింతాకృష్ణమూర్తి, గోపాలపురం- సబ్బతి పెడలయ్య, కొవ్వూరు- బుంగా సారధి, తణుకు- ఆకుల శ్రీరాములు, తాడెపల్లిగూడెం- ఈలినాని, దెందులూరు- అశోక్‌గౌడ్, ఏలూరు కోట- రామారావు, చింతలపూడు- అంబేద్కర్, గన్నవరం- బత్తిన రాంమోహన్‌రావు, విజయవాడ వెస్ట్- ఎల్లంపల్లి శ్రీనివాస్, మంగళగిరి- జానకిదేవి, నర్సారావుపేట్- విజయకుమార్, వినుకొండ- బ్రహ్మనాయుడు, చర్ల- సుధాకర్‌యాదవ్, అద్దంకి- జ్వాలారావు, మార్కాపురం- హుస్సేన్‌బేగ్, కనిగిరి- ఉమామహేశ్వరి, కర్నూలు- యానం రాజశేఖర్‌రెడ్డిలను బరిలోకి దించారు.