వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > పీఆర్పీకి డాక్టర్ సమరం రాజీనామా
వార్తలు
టికెట్ దక్కలేదన్న అక్కసుతో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. ఈ వరుసలో ప్రముఖ సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ జి.సమరం ప్రజారాజ్యం పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో గుర్తింపులేని కారణంగానే తాను వైదొలుగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై సమరం మాట్లాడుతూ పార్టీల కోసం పని చేసేవారిని కాదని వలసవాదులకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. అందుకే పార్టీకి రాజీనామా చేయడంతో పాటు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నుంచి కూడా తాను వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పార్టీ ప్రారంభం నుంచి పీఆర్పీలో ప్రముఖపాత్ర పోషించిన అంజనేయరెడ్డి వైదొలిగిన తరుణంలో సమరం కూడా వైదొలగడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఈ విషమయై అంతకుముందు పీఆర్పీ అధినేత చిరంజీవి మాట్లాడుతూ సామాజిక న్యాయం పాటించడం, కొన్ని సమీకరణాల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ టికెట్లు కేటాయించడం సాధ్యం కాలేదని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకుని పార్టీ విజయానకి పనిచేయాలని ఆయన కోరారు.