పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరించి రెబల్ అభ్యర్ధులుగా ఎన్నికల బరిలో నిలిచిన 40మందిపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని అధిష్టానం కోరినా వెనక్కు తగ్గని కారణంగా సదరు అభ్యర్ధుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మాట్లాడుతూ అదిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించిన 40మందిని పార్టీనుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన వయలార్ రవి హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా రెబల్ అభ్యర్ధులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే సదరు అభ్యర్ధులు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో చివరకు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.