చిరంజీవి తెలంగాణా పర్యటన షెడ్యూల్ | |
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మంగళవారం నుంచి ఐదు తెలంగాణ జిల్లాల్లో విజయభేరి యాత్రను ఆరంభించారు. తొలుత హెలికాఫ్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా యాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది. కాగా, చిరంజీవి తన తొలి రోజు పర్యటనలో నల్గొండ జిల్లా పరిధిలోని మునుగోడు, నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, కోదాడ, సూర్యాపేటలలో పర్యటిస్తారు. అలాగే ఏప్రిల్ 8వ తేదీన మెదక్, గజ్వేల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరులలో, 9న రంగారెడ్డి, ఇబ్రహీంపట్నంలలో పర్యటిస్తారు.
10వ తేదీన కరీంనగర్ జిల్లా మంథని, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, చొప్పదండి, కరీంనగర్‌లలోనూ, 11వ తేదీన నిజామాబాద్ జిల్లా కోరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్‌లలో పర్యటిస్తారు. 12న వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, డోర్నకల్, వర్ధన్నపేట, జనగాం, వరంగల్‌లలో, 13న విశాఖపట్నం, అనకాపల్లిలలో, 14న శ్రీకాకుళం, విజయనగరంలలో ఈ యాత్ర జరుగనుంది.