ప్రజారాజ్యం పార్టీ నుంచి వైదొలగుతున్నట్టు వచ్చిన వార్తలపై ఆ పార్టీ అధికారిక ప్రతినిధి డాక్టర్ మిత్రా మండిపడ్డారు. తాను పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు. తాను గుడ్‌బై చెపుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనని ఆయన ఖండించారు. అయితే, పార్టీ టికెట్ల కేటాయింపులో మాత్రం అంసంతృప్తికి లోనైన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.
ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారంగా ఆయన తేల్చి పారేశారు. తమ పార్టీ అంతర్గత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తృతీయ ఫ్రంట్‌పై తమకు నమ్మకం లేదన్నారు. అందువల్లనే నాల్గో ఫ్రంట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు మిత్రా ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.