వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > నేడు అనకాపల్లిలో అల్లు అర్జున్ ప్రచారం
వార్తలు
రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో వివిధ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్ధుల తరపున వారి బంధువులు సైతం ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ కోవలోనే ప్రజారాజ్యం పార్టీ తరపున అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్న అల్లు అరవింద్‌కు మద్దతుగా ఆయన కుమారుడు, ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించనున్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ బుధవారం అనకాపల్లి నియోజకవర్గంలోని పరవాడ, సబ్బవరం, లంకేపల్లి, గుల్లేపల్లి, పినగాడ తదితర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అదేసమయంలో బుధవారం అల్లు అర్జున్ పుట్టినరోజు కూడా కావడంతో ఆయన తన పుట్టినరోజు పండుగను అభిమానుల సమక్షంలో జరుపుకోనున్నారు. అటుపై మధ్యాహ్నం నుంచి అల్లు అర్జున్ తన రోడ్‌షోలకు శ్రీకారం చుట్టనున్నారు.