గుంటూరు జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలు యధాతథంగా జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో లోక్‌సత్తా పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల సత్యనారాయణ చౌదరి హఠాత్తుగా గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించారు.
దాంతో రేపల్లె ఎన్నికలు వాయిదా పడతాయన్న ఊహాగానాలు తలెత్తాయి. లోక్‌సత్తా పార్టీ రిజస్టర్ పార్టీ కాబట్టి ఎన్నికలు జరడానికి ఎలాంటి ఆటంకం లేదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు యథావిధిగా జరుగతాయని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ నియోజకవర్గానికి రెండో దశలో ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరుగనుంది.