అధిష్టానం ఆదేశాలను ఖాతరు చేయకుండా తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పెద్దపల్లి స్థానం రెబల్ అభ్యర్థి సీహెచ్. విజయ రమణా రావును తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా పెద్దపల్లి స్థానం తెలంగాణా రాష్ట్ర సమితికి కేటాయించారు.
అయితే తెలుగు దేశం అభ్యర్థి సిహెచ్ విజయ రమణా రావు దాఖలు చేసిన నామినేషన్‌ను వాపసు తీసుకోకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.షరీఫ్ తెలిపారు.
పార్టీ ఆదేశాలను బేఖాతరు చేశారనీ, దీనివల్ల తెరాసకు నష్టం కల్గించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే ప్రమాదం నెలకొందని షరీఫ్ తెలిపారు. పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలో స్థానికంగా ఉన్న తెరాస అభ్యర్థి గెలుపు కోసం తమ సహాయ సహకారాలను అందిస్తామని షరీఫ్ కోరారు.