వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > 21న తిరుపతిలో చంద్రబాబు విజయశంఖారావం
వార్తలు
FILE
రాష్ట్రంలో ఎన్నికల హడావుడి వేడెక్కుతోన్న నేపథ్యంలో, వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 11, 17 తేదీల్లో గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే తమ పార్టీ ప్రచారం కోసం యువ హీరోలైన ఎన్టీఆర్, బాలకృష్ణలను రంగంలోకి చంద్రబాబు రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. మహాకూటమి తరపున, తెదేపా తరపున తాను కూడా ప్రచారగళంలోకి దిగిన చంద్రబాబు రెండో విడత ఎన్నికల ప్రచారం ముగింపు రోజైన 21న తిరుపతిలో "విజయశంఖారావం" పేరుతో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ తరపున ఏర్పాటవుతున్న ఈ బహిరంగసభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు.

ఇకపోతే.. మహాకూటమి నేతృత్వంలో ఈ నెల 13వ తేదీన జరిగే సభకు తెరాస అధినేత కేసీఆర్ హాజరు కారని తెదేపా పార్టీ శ్రేణుల సమాచారం.