వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > ప్రజారాజ్యం రెబల్స్‌పై బహిష్కర వేటు
వార్తలు
తిరుగుబాటుదార్లపై ప్రజారాజ్యం పార్టీ కొరఢా ఝుళిపించింది. పార్టీ ప్రకటించిన అధికారపూర్వక అభ్యర్థులకు పోటీగా రంగంలోకి దిగిన 34 మంది రెబల్స్‌ను బహిష్కరిస్తున్నట్టు పీఆర్పీ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఉపేంద్ర ప్రకటన విడుదల చేశారు. బహిష్కృతులంతా తొలి విడత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. బహిష్కృత అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.

పొన్నాల వినయ్‌ (చెన్నూరు), రావుల రామకృష్ణ (బెల్లంపల్లి), నీలకంఠేశ్వరరావు (మంచిర్యాల), ఇంగు రతన్‌కుమార్‌ (మంచిర్యాల), చల్లా చందు (ఆదిలాబాద్‌), ఆర్‌ చంద్రశేఖర్ ‌(సిద్ధిపేట), ఫతేనాయక్‌ (నారాయణఖేడ్‌), మల్లేశం (దుబ్బాక), ఎంఎస్‌.శ్రీనివాస్‌ (కుత్బుల్లాపూర్‌), ఎ.శ్రీనివాసరెడ్డి (నారాయణపేట), మధుసూదన్‌ బాబు (గద్వాల్‌), దిలీప్‌ (నాగర్‌ కర్నూల్‌), శివరాజ్‌ (అచ్చంపేట), నాగేశ్వరరావు (కొల్లాపూర్‌), వి.సొండమణి (నాగార్జునసాగర్‌), గైనేని రాజన్‌ (వరంగల్‌ పశ్చిమ), దారావత్‌ చందునాయక్‌ (పినపాక), ఎల్‌.గిరిబాబు (వైరా), కిషన్‌ నాయక్‌ (వైరా), కొండు కోటేశ్వరరావు (సత్తుపల్లి) ఉన్నారు.

కొండూరి సుషిత (సత్తుపల్లి), గోపి శంకర్‌ (పలాస), డాక్టర్‌ నరేంద్ర (ఆముదాల వలస), కోదాడ శ్యాంసుందర్‌ (ఆముదాలవలస), పీజే.అమృతకుమారి (రాజాం), వేల్పుల విజయకుమార్‌ (పార్వతీపురం), రాయల సుందరరావు (సాలూరు), రాజబాబు (భీమిలి), పాటాడి సురేష్‌బాబు (తుంగతుర్తి), డి.శ్రీధర్‌రెడ్డి (ఆలేరు), బొల్లా లింగయ్య యాదవ్‌(హుజూర్‌నగర్‌), శ్రీనివాసాచార్యులు (హుజూర్‌నగర్‌), పోలీసు జీవేందర్‌ రెడ్డి (కుత్బుల్లాపూర్‌), పోలీసు సుమిత్రా జీవేందర్‌ రెడ్డి (కుత్బుల్లాపూర్‌).