ప్రజారాజ్యం పార్టీ కాదనీ, ఒక విప్లవమని ఆ పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు అన్నారు. ప్రజారాజ్యం పార్టీపై విమర్శలు గుప్పించిన పరకాల ప్రభాకర్‌పై నాగేంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. తాను, తన తమ్ముడు పవన్ కల్యాణ్‌లు పార్టీ నుంచి నిష్క్రమించినప్పటికీ పార్టీకి వచ్చే నష్టమేమీ ఉండదన్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరులో నాగబాబు మీడియా సిబ్బందితో మాట్లాడుతూ, పీఆర్పీ ఒక పార్టీ కాదని, ఒక విప్లవం అని పేర్కొన్నారు. 'వెనుకబడిన తరగతులు, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం చిరంజీవి అవిశ్రాంతంగా పాటుపడుతున్నారు' అన్నారు. పార్టీలో పేదలకు చోటు లేదన్న ప్రభాకర్ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తమది ప్రజల పార్టీ అని, బలహీన వర్గాల పార్టీ, దళితుల పార్టీ అని నాగబాబు చెప్పుకొచ్చారు.
పార్టీ టిక్కెట్లను అమ్ముకున్నారనే ఆరోపణలను నాగబాబు తోసిపుచ్చుతూ, పార్టీ దృష్టి డబ్బుపైనే ఉంటే అంత ఎక్కువ మంది బీసీలకు టిక్కెట్లు ఇచ్చి ఉండేవారం కామన్నారు. 'సామాజిక న్యాయం సాధించడానికే మా రైలు పట్టాలపైకి వచ్చిందన్నారు. పిఆర్పీ లోక్‌సభ అభ్యర్థి తోట చంద్రశేఖర్ ఈ పర్యటనలో నాగబాబు వెంట ఉన్నారు.