వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > కాంగ్రెస్-తెదేపా నేతల్లో రైలింజన్ దడ: చిరంజీవి
వార్తలు
FileFILE
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ప్రజారాజ్యం పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందని సోమవారం విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం సభలో చిరంజీవి స్పష్టం చేశారు. సామాజిక న్యాయం పునాదిగా మనసా వాచా కర్మణా నడిచే ప్రజారాజ్యం పార్టీని ఎన్నుకునేందుకు తాను ఆధారంగా, ఆయుధంగా పని చేస్తాను అని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ సభకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. సామాజిక న్యాయం గురించి తొలిసారిగా తెలుగునేలపై వెలుగెత్తి చాటింది ప్రజారాజ్యం పార్టీయేనని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయం గురించి మాట్లాడటంతో మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఇదే విషయాన్ని తమదిగా ప్రచారం చేసుకుంటున్నాయని చెప్పారు. బీసీలకు 30 శాతం సీట్లు కేటాయించాలని తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల్లో మాత్రం.. 50-60 సీట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని చిరంజీవి విమర్శించారు.

సామాజిక న్యాయాన్ని అమలు చేస్తామని తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చిరంజీవి గుర్తు చేశారు. వందకు పైగా సీట్లు ఇస్తామని చెప్పగా, ఆచరణలో 104 సీట్లు కేటాయించినట్లు చిరంజీవి తెలిపారు. కాంగ్రెస్, తెదేపా పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకున్న చరిత్ర ఆ పార్టీలకు లేదని ఆయన ఆరోపించారు.