నేరచరిత్రగల అభ్యర్థులను బరిలోకి దింపిన పార్టీల్లో కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంది. తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 24 మంది నేర చరిత్రగల అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరపున 23 మంది, బీఎస్పీ 17, సమాజ్ వాదీ పార్టీ తరపున 10 మంది నేర చరిత్ర గలిగిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలలోకెల్లా బీహార్‌లో నేరచరిత ఉన్న అభ్యర్థులు అత్యధికంగా 51 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. పోటీ చేస్తున్నవారిలో 306 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ వగైరా కేసులు ఉన్నాయి.
మొదటి దశ పోలింగ్‌లో 193 మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 45, భాజపా తరపున 30 మంది, బీఎస్పీ తరపున 22 మంది కోటీశ్వరులు పోటీ పడుతున్నారు.
ఎన్నికలలో పోటీ చేస్తున్న కోటీశ్వరుల శాతం 2004లో 9% ఉంటే, 2009కి అది 14%గా ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీలో సగటున ఒక్కో అభ్యర్థి 4.3 కోట్ల రూపాయలు కలిగి ఉన్నారు. భాజపా అభ్యర్థులు రూ. 2 కోట్ల రూపాయలను కలిగి ఉన్నారు.
పోటీ చేస్తున్న 68% మంది పాన్ కార్డు వివరాలను పొందుపరచలేదు. కాగా తొలిదశ ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థుల్లో 60శాతం మంది పట్టభద్రులుగా ఉన్నారు.