వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > సార్వత్రిక ఎన్నికలు: తొలి దశ పోలింగ్ వివరాలు
వార్తలు
దేశ వ్యాప్తంగా ప్రారంభమైన తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. తొలి దశ ఎన్నికల్లో మొత్తం 124 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం నక్సలైట్లు పోలింగ్‌కు కొంతమేరకు విఘాతం కల్పించగా, మిగిలిన చోట్ల ప్రశాంతంగా సాగుతోంది.

ఎన్నికలు జరిగే లోక్‌సభ స్థానాలు.. 124

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, జమ్మూ కాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అండమాన్ అండ్ నికోబారా దీవులు, లక్ష్వదీప్.

మొత్తం ఓటర్లు.. 143.1 మిలియన్లు

మొత్తం అభ్యర్థులు.. 1715

మొత్తం మహిళా అభ్యర్థులు.. 122

అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలు.. మహబూబ్ నగర్ (ఆంధ్ర), రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్)లలో 32 మంది చొప్పున పోటీచేస్తున్నారు.

మహిళలు అధిక సంఖ్యలో పోటీ చేస్తున్న స్థానాలు.. మహబూబ్ నగర్ (ఆంధ్ర), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)లలో ఐదుగురు చొప్పున పోటీ చేస్తున్నారు.

పార్టీల పోటీ చేసే స్థానాలు.. భాజపా 102, బీఎస్పీ 111, సీపీఎం 23, కాంగ్రెస్ 111, నేషనల్ కాంగ్రెస్ పార్టీ 14, సీపీఐ 15, ఆర్జేడీ 18, ఇతర పార్టీలు 136 సీట్లలో పోటీ చేస్తుండగా, 1185 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.

పోలింగ్ కేంద్రాలు.. 185552

పోలింగ్ స్టాఫ్.. 900,000

ఉపయోగిస్తున్న ఈవీఎంలు.. 300,166

సమస్యాత్మక గ్రామాలు/పట్ణణాలు.. 23,000.