వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > నేటి నుంచి కోస్తా, రాయలసీమల్లో చిరు ప్రచారం
వార్తలు
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి గురువారం నుంచి ఆరు రోజుల పాటు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఎన్నికల ప్రచార నిర్వహణకు శ్రీకారం చుట్టారు. 16వ తేదీ గురువారం గుంటూరు జిల్లా మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, గుంటూరులలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 17వ తేదీన మచిలీపట్నం, చీరాల, కనిగిరి, ఒంగోలు, కావలి, నెల్లూరులలో ప్రచారంలో పాల్గొంటారు.

18వ తేదీన నెల్లూరు, బద్వేలు, రాయచోటి, కడప, కదిరి, రాయదుర్గం, కల్యాణదుర్గం, మడకసిరలలో జరిగే రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. 19వ తేదీన ఉరవకొండ, తాడిపత్రి, ధర్మవరం, నంద్యాల, మంత్రాలయం, కర్నూలులోల రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు.

ఏప్రిల్ 20న కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, చింతలపూడి, పాలకొల్లులలో ప్రచార కార్యక్రమాలలో పాల్గొని ఆ రోజు రాత్రి పాలకొల్లులో బసచేస్తారు. 21వ తేదీన చిత్తూరు, తిరుపతిలలో ప్రచారంలో పాల్గొంటారు.

ఇదిలావుండగా, యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 16 నుంచి 20 వరకు రాయలసీమ, కోస్తాలో ప్రచారం నిర్వహిస్తారు. గురువారం హెలికాప్టర్‌లో బయలుదేరి రాజంపేట, తిరుపతిలలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.

శుక్రవారం తిరుపతి, హిందుపూర్, పెనుగొండ, అనంతపురంలలో, శనివారం వెంకటగిరి, నెల్లూరు, మార్కాపురంలలో, ఆదివారం గుంటూరు జిల్లాలో, సోమవారం విజయవాడలో ప్రచారం నిర్వహిస్తారు.