వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > ముగిసిన తొలిదశ ఎన్నికలు: 60 శాతం పోలింగ్
వార్తలు
రాష్ట్రంలో జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో జరిగిన 22 లోక్‌సభ, 154 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సుమారు 60 శాతం మేరకు పోలింగ్ జరిగినట్టు ప్రాథమిక అంచనా. అయితే, మహబాబ్‌నగర్ 17 పోలింగ్ కేంద్రాలతో సహా హైదరాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి.

హైదరాబాద్‌ నగరంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాతంగా ముగిసిందని హైదరాబాద్ కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. పాతబస్తీలో మాత్రం ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తల మధ్య స్వల్ప స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తున్న ఆరోపణలతో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ స్వయంగా దాడికి దిగడం గమనార్హం.

కాగా, తొలిదశ ఎన్నికలు జరిగిన 13 జిల్లాలో చిన్నచిన్న ఘర్షణలు, దాడులు మినహా పోలింగ్ ఎక్కడా పెద్దగా అడ్డంకులు ఏర్పడలేదు. మొత్తం మీద మావోయిస్టుల దుశ్చర్యలు, దాడులు, హింసాత్మక సంఘటనలు లేకుండా తొలిదశ పోలింగ్ జరుగుతోంది.

కాగా, ప్రాథమికంగా అంచనా మేరకు శ్రీకాకుళంలో 61.5 శాతం, విజయనగరంలో 59.7 శాతం, అదిలాబాద్‌లో 53 శాతం, మహబూబ్‌నగర్‌లో 65.6 శాతం, హైదరాబాద్ 45 శాతం, కరీంనగర్ 49.5, నల్గొండ 61, వరంగల్ 60.5, రంగారెడ్డి 52.1, మెదక్ 49.5, నిజామాబాద్ 62, ఖమ్మం 65, విశాఖపట్నం 60 శాతం మేరకు పోలింగ్ నమోదైనట్టు అంచన.