వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > అనారోగ్యం కారణంగా పవన్‌ పర్యటన రద్దు
వార్తలు
ప్రజారాజ్యం పార్టీ అనుబంధ విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విజయవాడ పర్యటన రద్దు అయింది. అనారోగ్యం కారణంగా ఈ పర్యటనను రద్దు అయినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో స్థానిక కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. ఆదివారం గుంటూరు జిల్లాలో విస్తృతంగా రోడ్‌షోలలో పాల్గొన్న పవన్‌.. అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం కూడా ఆయన నీరసంగా ఉండటంతో విజయవాడలోని ఒక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.

అయినప్పటికీ, ఆయన ఆరోగ్యంలో ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో పర్యటనను రద్దుచేసుకుని హైదరాబాద్‌కు వెళ్లి పోయారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రజారాజ్యం పార్టీ 165 సీట్లను గెలుచుకుని ఖచ్చితంగా అధికారాన్ని కైవసం చేసుకుంటుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ళ చంద్రబాబు పాలన రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ పాలన పూర్తిగా అవినీతిమయమైందని పవన్ ఆరోపించారు.