దేశంలో 107 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఓటింగ్ ఓ మోస్తరుగా నమోదైంది. మొత్తం 9 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో లక్షా 65 వేల పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ మూడోదశ ఎన్నికలతో ఇప్పటివరకూ 372 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగినట్లయింది. ఎన్నికలు జరిగిన స్థానాలలో అత్యధిక స్థానాలను తాము గెలుచుకుంటామంటే తాము గెలుచుకుంటామని ఎన్డీఏ, యూపీఎ పక్షాలు లెక్కలు వేసి చెపుతున్నాయి. మూడోదశ ఎన్నికలు జరిగిన 107 స్థానాలలో అత్యధిక స్థానాలను తాము గెలుచుకుంటామని భారతీయ జనతాపార్టీ అంటోంది.
మూడోదశ ఎన్నికలలో బరిలో నిలిచిన 1567మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్కే అద్వానీ కూడా ఉన్నారు. కాగా మిగిలిన 171 లోక్‌సభ స్థానాలకు మే 7, మే 13 తేదీలలో ఎన్నికలు జరుగనున్నాయి.