ఇటీవల ముగిసిన ఎన్నికల ప్రక్రియలో పార్టీ తీరుతెన్నులు గురించి చర్చించేందుకు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఓటింగ్ సరళి గురించి పార్టీ విజయావకాశాల గురించి ఆయన జిల్లా నేతలతో చర్చించారు.
చిరంజీవి పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పార్టీ కన్వీనర్, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పార్టీ అంచనాలకు అందని రీతిలో విజయాన్ని సొంతం చేసుకుంటుందని పేర్కొన్నారు.
ఏ సర్వేలకు అందని రీతిలో పార్టీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.