వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > ములాయం క్షమాపణ చెప్పాలి: బీఎస్పీ
వార్తలు
ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాయావతి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. ఎన్నికల తదనంతరం మాయావతి ప్రభుత్వాన్ని కూలదోసే కూటమికి మద్దతు పలుకుతామని ఎస్పీ అధినేత ములాయం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తమ పార్టీకి క్షమాపణ చెప్పాలని కోరాయి.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ మౌర్య విలేకరులతో మాట్లాడుతూ, ఒక బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

ప్రజల మద్దతుతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని కూలదోయాలని ములాయం వ్యాఖ్యానించడాన్ని చూస్తే అతని మానసిక స్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ములాయం తన వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌లోని 20 కోట్లమంది ప్రజలను అవమానపరిచారని ప్రసాద్ దుయ్యబట్టారు.