వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > లాలూ, పాశ్వాన్‌లను యూపీఎ నుంచి గెంటేయండి
వార్తలు
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, ఎల్జేపీ నేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌లిరువురినీ యూపీఏకు దూరంగా ఉంచాలని బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ అధిష్టానాన్ని అభ్యర్థించింది.

లాలూ, పాశ్వాన్‌లిద్దరినీ దూరంగా ఉంచాలని బీహార్‌లోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూనిట్ అధినేత అనిల్ కుమార్ శర్మ వెల్లడించారు.

లాలూ, పాశ్వాన్లు అవకాశవాద రాజకీయవాదులని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు వీరిరువురూ శతవిధాలా యత్నించారని, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్ పార్టీకి భాగం ఉందని అనేక ఆరోపణలు చేశారని శర్మ దుయ్యబట్టారు. కనుక వీరిరువురినీ యూపీఎ నుంచి తొలగించాలని ఆయన కోరారు.