అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈనెల 16వ తేదీన వెలువడనున్నాయి. ఆ తర్వాత కొత్త సభ్యులు రాష్ట్ర సచివాలయంలో కొలువుతీరుతారు. వీరికోసం కొత్త హంగులతో అసెంబ్లీని కొంగ్రొత్తగా ముస్తాబు చేస్తున్నారు.
13వ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీ ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రంలో పెద్దల సభ (శాసనసభ) కూడా ఉన్నందున గవర్నర్ ప్రసంగానికి శాసనసభ్యులు కూడా హాజరవుతారు. అందువల్ల ఉభయ సభల సభ్యులు ఆసీనులయ్యే విధంగా సభను ముస్తాబు చేస్తున్నారు.
ఇదిలావుండగా, ఎన్నికల ఫలితాల అనంతరం ఒక పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ 148 సీట్లు సాధిస్తే.. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పాటైతే మాత్రం ఎక్కువ సీట్లు సాధించిన అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానిస్తారు. అనంతరం నిర్ణీత గడువులోగా సభలో బలాన్ని నిరూపించుకోవాల్సి వుంటుంది.