వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > నితీష్‌ కుమార్ తోడుదొంగ: లాలూ
వార్తలు
నితీష్ కుమార్‌ తోడుదొంగ అనీ, ఎన్డీఏతో వ్యతిరేకత ప్రదర్శిస్తూ నాటకాలు ఆడటం ఆయనకు అలవాటని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. నితీష్‌‌‍ను లౌకికవాదిగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి నిన్నటితో ఆయన ఎలాంటివారో తెలిసి ఉంటుందన్నారు.

లౌకికవాదానికి వ్యతిరేకంగా పనిచేసేవారితో కలిసి వెళ్లబోననీ, నరేంద్ర మోడీ పాల్గొనే ఏ బహిరంగ సభలోనూ తాను పాల్గొనబోననీ చెప్పిన నితీష్, బీహార్‌లో ఎన్నికలు ముగియగానే ప్లేటు ఫిరాయించి తన నిజస్వరూపం బయటపెట్టారని లాలూ విమర్శించారు.

నితీష్ అసలు స్వరూపం తనకు తెలుసననీ, అందుకే నితీష్ ఓ గజదొంగ అని అందరికీ చెపుతుంటాననీ లాలూ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గంలో ఎన్నికల పర్యటనలో పాల్గొన్న అనంతంరం లాలూ విలేకరులతో మాట్లాడారు.