వార్తలు | కౌంట్‌డౌన్ ఎలక్షన్స్ 2009 | ఎలక్షన్ మ్యాప్ | ఎన్నికల ఫలితాలు
ప్రధాన పేజి ఇతరాలు  కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్  వార్తలు > పొత్తులకు మేమూ సిద్ధమే : పీఆర్పీ
వార్తలు
FILE
సార్వత్రిక ఎన్నికల అనంతరం పొత్తులకు తామ సిద్ధమేనని చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ప్రకటించింది. ఎన్నికల అనంతరం పొత్తులకు అన్ని రాజకీయ పార్టీలు సుముఖంగానే ఉంటాయని తాము సైతం అలాగే వ్యవహరించనున్నామని ఆ పార్టీ స్పష్టం చేసింది.

ఈ విషయమై ప్రజారాజ్యం ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఏపార్టీ ముందుకొచ్చినా పరిశీలిస్తామని అన్నారు. టీఆర్ఎస్‌ సైతం మీవైపు వస్తే ఆహ్వానిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తప్పకుండా అని పేర్కొన్నారు.

అలాగే ఆయన మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించడంలో టీవీ ఛానెల్స్ ప్రతిసారీ వాస్తవానికి దూరంగా ఉంటున్నాయని అన్నారు. గతంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని టీవీ ఛానెల్స్ ప్రకటించాయని అయితే సర్వేలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.