రాష్ట్రంలో ఐదేళ్ళ పరిపాలనను కొనసాగించిన ఏకైక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తనకు ఎంతో సంతృప్తికరంగా ఉందని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాలో ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై తన అంచనాలు ఇప్పటికీ మారలేదని 230 అసెంబ్లీ సీట్లు తమ పార్టీకి ఖచ్చితంగా వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా 2004 మే 14న వైఎస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.
ఇదిలావుండగా మరో ఐదేళ్లు రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజలు తమ పార్టీకే పట్టం కట్టనున్నారని ఆన తెలిపారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసేందుకు ఇతర పార్టీలేవీ ముందుకు రావని, యూపీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.