రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, కొత్త పార్టీ ప్రజారాజ్యం పార్టీలు అధికార పార్టీ విజయాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వివిధ పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.
మొత్తం స్థానాలు.. 294. కాంగ్రెస్.. 157 తెలుగుదేశం 90 ప్రజారాజ్యం 18 తెరాస 10 ఎంఐఎం 7 సీపీఐ 4 సీపీఎం 1 లోక్‌సత్తా 1 ఇండిపెండెంట్స్ 4.