| ఓటరు గుర్తింపుకార్డు లేకున్నా ఓటరు జాబితాలో పేరుంటే సదరు వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది. అయితే తాము జాబితాలో పేర్కొన్న ఏదో ఒక ఫోటో గుర్తింపు కార్డు ఉంటే ఓటుహక్కును వినియోగించుకోవచ్చని ఈసీ సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆదాయపన్ను గుర్తింపుకార్డు (పాన్)లు చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, పోస్టాఫీసులు... |