ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > చిరంజీవి 'మెగా' రాజకీయ చరిత్ర సృష్టిస్తారా...!?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిరంజీవి 'మెగా' రాజకీయ చరిత్ర సృష్టిస్తారా...!?
Munibabu
WD
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఆదివారం ఓ మహోన్నత ఘట్టానికి తెరలేవనుంది. తెలుగు చలనచిత్ర రంగంలో పునాది రాళ్లు వేసుకుని చిరంజీవిగా వెలుగులోకి వచ్చిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తన రాజకీయ రంగ ప్రవేశంపై ఆదివారం ప్రకటన చేయనున్నారు. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి, పార్టీ స్థాపన గురించి ఆదివారం మీడియాకు వెళ్లడించనున్నట్టు చిరంజీవి స్వయంగా పత్రికా ప్రతినిధులకు వర్తమానం పంపడంతో గత కొన్ని నెలలుగా సాగుతున్న ఉత్కంఠత క్లైమాక్స్ దశకు చేరుకుంది.

చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం గురించి కేవలం రాష్ట్రంలోని అభిమానులు, ప్రజలే కాదు అన్ని రాజకీయ పార్టీలూ ఎప్పుడా అంటూ ఇన్నాళ్లు ఎదురు చూశాయంటే చిరంజీవి రాజకీయ ప్రవేశంపై రాష్ట్రంలో ఎంతటి అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగు చలనచిత్ర తెరపై అశేష అభిమానుల ఆదరణ కల్గిన మెగాస్టార్‌గా చిరంజీవికి ఉన్న ఆదరాభిమానాలు అంతా ఇంతా కావన్న విషయం అందరికీ తెలిసిందే.

కేవలం నటుడిగానే కాక వివాద రహితుడిగా, స్వచ్ఛంద సంస్థల నిర్వహణతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఓ మహోన్నత వ్యక్తిగా చిరంజీవికి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇంతటి ఆదరాభిమానాలు, పేరు ప్రఖ్యాతులు ఉన్న చిరంజీవి రాజకీయ ప్రవేశం చేయబోతారని తెలిస్తే ఆయన అభిమానుల్లో ఆనందం... దగా పడ్డ ప్రజల్లో చిగురించే చిరు ఆశను మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు.

అదే సమయంలో చిరంజీవి లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపిస్తే ఇన్నాళ్లుగా రాజకీయాల్లో తాము అనుభవించిన పదవులు ఎక్కడ గల్లంతవుతాయో అన్న ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతల ఆందోళనను సైతం మనం మరింత సులభంగానే ఆకళింపు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ చర్చించబోయే అంశం పైదేదీ కాదు.

వీడియోను వీక్షించండి
1 | 2 | 3  >>