ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > చిరంజీవి 'మెగా' రాజకీయ చరిత్ర సృష్టిస్తారా...!?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిరంజీవి 'మెగా' రాజకీయ చరిత్ర సృష్టిస్తారా...!?
రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను, వారి అండదండలను సంపాదించుకున్న చిరంజీవి లాంటి ఛరిస్మా ఉన్న వ్యక్తి రాజకీయంలోకి ప్రవేశిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది ?... అన్నదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే ప్రతి ఒక్కరికీ ప్రధానంగా గుర్తుకొచ్చేది కాంగ్రెస్, టీడీపీ పార్టీలే. ఈ రెండూ కాకుండా బీజేపీ, వామపక్ష పార్టీలు ఉన్నా సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించే స్ధితిలో ఆ పార్టీలు లేవన్నది నిస్సందేహం. అలాగే గత ఎన్నికలకు ముందూ... ఆ తర్వాత పుట్టుకొచ్చిన తెలంగాణావాద పార్టీలు కేవలం ఆ వాదానికి కట్టుబడి ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదో అందరికీ తెలిసిందే.

ఇలాంటి పరిస్థితిలో కొత్త పార్టీ స్థాపించి చిరంజీవి తెరమీదకొస్తే రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఏర్పడుతుందన్నది కొందరి రాజకీయ విశ్లేషకుల వాదన. స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి అధికారంలోకి వచ్చి పోతోన్న కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఉండగా 1983లో పెను విప్లవంగా తెరమీదకొచ్చిన తెలుగుదేశం మరోవైపు ఉంది. ఈ రెంటి నడుమ చిరంజీవి కొత్త పార్టీతో అధికారాన్ని కైవసం చేసుకోగలరా...? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా తేల్చి చెప్పలేని స్థితి.

ఎందుకంటే ప్రస్తుత కాలంలో దేశం నుంచి రాష్ట్ర స్థాయిలలో ఎన్నికలు జరిగి తుది ఫలితం వచ్చే వరకు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అభివృద్ధి మంత్రం గెలిపిస్తుందని అధికార పార్టీలు ధీమా ప్రదర్శిస్తున్నా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు గట్టెక్కిస్తుందని ప్రతిపక్షాలు తొడలు కొట్టినా ఫలితాలు మాత్రం ఎప్పుడూ ఊహించని రీతిలోనే వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

వీడియోను వీక్షించండి
<< 1 | 2 | 3  >>