ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > రాజకీయ ఛట్రంలో చిరు నటిస్తారా? జీవిస్తారా?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాజకీయ ఛట్రంలో చిరు నటిస్తారా? జీవిస్తారా?
FileFILE
కళారంగంపై ఆసక్తి..
చిరంజీవికి సినిమాల్లో నటించాలన్నది చిన్న వయస్సులోనే ఆయన మనసులో నాటుకున్న కల. అందుకే స్కూల్ వయస్సు నుంచే డ్రామాల్లో నటిస్తూ తన నటనాసక్తికి తీర్చుకున్నారు. ఒకవైపు చదువుతున్నా సినిమాల్లో నటించాలన్న ఆసక్తిని వదులుకోలేదు. అందుకే తన డిగ్రీ ముగించగానే 1977లో మద్రాస్ వెళ్ళి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అదే సమయంలో రాజ్‌కుమార్ దర్శకత్వంలో షేక్ అబ్దుల్ ఖాదర్ రూపొందిస్తున్న 'పునాదిరాళ్ళు' చిత్రంలో నటించే సువర్ణావకాశం లభించింది.

ఈ చిత్రంలో నటించేటప్పుడే శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మారారు. 'పునాదిరాళ్ళు' చిరు మొదటి చిత్రమే అయినా ముందుగా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది మాత్రం 'ప్రాణంఖరీదు'. దీనికి కె.వాసు దర్శకుడు. తదనంతరం విడుదలైన రెండవ చిత్రం 'మన ఊరి పాండవులు'. ఈ చిత్రం చిరుకు హీరోగా గుర్తింపు లభింది. హీరో వేషాలు లభించక మునుపు.. విలన్ పాత్రల్లో సైతం పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. విలన్‌గా నటించిన చిత్రాల్లో 'కుక్కకాటుకు చెప్పుదెబ్బ',' కోతల రాయుడు' తదితర చిత్రాలు ఉన్నాయి.


ఆరంభ విజయాలు..
ఆరంభంలో కోతలరాయుడు, పున్నమినాగు, మొగుడుకావాలి, కిరాయిరౌడీలు, శుభలేఖ, మగమహారాజు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అభిలాష, మంత్రిగారి వియ్యంకుడు తదితర చిత్రాలు విజయం సాధించటం చిరంజీవి పరిశ్రమలొ నిలదొక్కుకునేందుకు దారితీసింది.

కీలక మలుపు...
1983లో విడుదలైన 'ఖైదీ' చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పింది. కమర్షియల్‌గా మెగా హిట్ తోపాటు చిరుకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఈ ద్వారా చిరంజీవిలోని నటుడు, డ్యాన్సర్ తెలుగు పరిశ్రమకు దక్కాడు. అనంతరం గూండా, దొంగ, నాగు, అడవిదొంగ, యమకింకరుడు, రుస్తుం ద్వారా చిరు యాక్షన్ హీరో గుర్తింపుపొందారు.

మెగా విజయాలు..
ద్వితీయార్థంలో విజేత, మగధీరుడు, కొండవీటిరాజా, చంటబ్బాయ్, చాలెంజ్, రాక్షసుడు, దొంగమొగుడు వంటి చిత్రాల విజయాలు నటుడిగా అన్ని వర్గాల వారి నుంచి చిరుకు లభించాయి. 1987లో విడుదలైన పసివాడి ప్రాణం ద్వారా భారతీయ సినిమాలకు చిరు బ్రేక్ డ్యాన్స్ చూపించారు. అదే సమయంలో విడుదలైన స్వయంకృషి చిత్రంతో చిరంజీవికి ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు.

చిరు ఓ ప్రభంజనం..
"పసివాడి ప్రాణం" అనంతరం వచ్చిన 'యముడికి మొగుడు', 'అత్తకి యముడు అమ్మాయికి మొగుడు' చిరును మెగాస్టార్‌గా నిలిపాయి. నిర్మాత కేఎస్.రామారావు తన 'మరణమృదంగం' చిత్రం ద్వారా చిరును మెగాస్టార్‌గా సంబోధించటం ఆయన మెగా నటుడిగా రూపాంతరం చెందేలా చేసింది. తదనంతరం చిరు నిర్మాతల పాలిట హాట్‌కేక్ కాగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ సమయంలోనే చిరు నిర్మాతగా తీసిన రుద్రవీణ నర్గీస్‌దత్ అవార్డును సొంతం చేసుకుని జాతీయంగా ఆయనకు పేరు ప్రఖ్యాతులను సాధించి పెట్టింది.

జాతీయంగా...
1990 కాలంలో విడుదలైన 'గ్యాంగ్ లీడర్', 'రౌడీల్లుడు', 'జగదేకవీరుడు అతిలోక సుందరి', 'ఘరానమొగుడు' వంటి చిత్రాలు చిరును జాతీయ హీరోను చేశాయి. ఈ సమయంలోనే చిరు హిందీలో నటించిన 'ప్రతిభంధ్', 'ఆజ్ కా గూండారాజ్', 'ది జంటిల్ మెన్' చిత్రాలు బాక్సాఫీస్ రికార్డు సృష్టించి ఆయన్ను జాతీయ నటుడిగా నిలబెట్టాయి.
వీడియోను వీక్షించండి
<< 1 | 2 | 3  >>  
మరిన్ని
మెగా 'పంచ్' లైన్స్  
చిరంజీవి 'మెగా' రాజకీయ చరిత్ర సృష్టిస్తారా...!?