ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > తారక రాముని నామ స్మరణలో పార్టీలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తారక రాముని నామ స్మరణలో పార్టీలు
IVR
FILE
అది 1982 సంవత్సరం. మార్చి 29వ తేది. ఆంధ్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించిన రోజు. ఎందుకంటే నాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి "తెలుగువారి ఆత్మగౌరవం" నినాదంతో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఆయన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. దురదృష్టవశాత్తూ... ఆ తర్వాత ఆయన పదవీచ్యుతుడయ్యారు. తదనంతరం జరిగిన పరిణామాల ఫలితంగా.. ఆయన పరలోకానికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. అప్పట్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ కొన్నాళ్లు నందమూరి పేరును ప్రస్తావించలేదు. అయితే తెలుగునాట ఎన్టీఆర్ ఇమేజ్ దృష్ట్యా ఆయన ఫోటోలు తెలుగుదేశం సభల్లో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. బహిరంగ సభల్లో చంద్రబాబు "తారక మంత్రం" అందుకోక తప్పలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ మరణించినా ఆయన చేసిన సేవలను ఆంధ్రులు మరువలేదు. మరువలేరు.

ఇక ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితిని చూస్తే... గత ఆదివారం తను రాజకీయాలలోకి ప్రవేశించడానికి ఎన్టీఆర్ స్ఫూర్తి అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. నటులకూ సామాజిక బాధ్యత ఉందని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాలలో అడుగిడుతున్నానని ప్రకటించారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం అప్పుడప్పుడు ఎన్టీఆర్‌ను స్తుతిస్తుండటం కనబడుతోంది. మొత్తం మీద చూస్తే... స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు చెబితే తెలుగువారి కళ్ల ముందు నాడు ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు ఆవిష్కృతమవుతాయి. అందుకనే అప్పటి నుంచి ఇప్పటికీ... మరి ఎప్పటికీ ఎన్టీఆర్ ఈజ్ గ్రేట్. ఆయన తిరుగులేని నాయకుడు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
రాజకీయ చట్రంలో చిరు నటిస్తారా? జీవిస్తారా?  
మెగా 'పంచ్' లైన్స్  
చిరంజీవి 'మెగా' రాజకీయ చరిత్ర సృష్టిస్తారా...!?