చిరంజీవికి సినిమాలు చేసి.. చేసి... కాస్త ఏవగింపు వచ్చినట్టుంది. ప్రజాసేవలో తరించాలనే కొత్త తలంపుతో రాజకీయ యవనికపై ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా సినీ రంగ పెద్దల మధ్య జరిగే పుట్టిన రోజు వేడుకలు ఈ దఫా కుటుంబ సభ్యుల మధ్యే అయినా.. ఆయనకు 'విష్ యు హ్యాపీ పాలిటిక్స్ టూ యూ' అనే శుభాకాంక్షలు చెప్పేవారే కనిపిస్తారు... అవే ఆయనకు వినిపిస్తాయి.
సినిమా వ్యక్తులు రాజకీయాలను యేలటం ఆంధ్రదేశానికి కొత్తేమీ కాదు. ఇలాంటి వారు సముద్రపు అలల ఆటుపోటుల్లా రాజకీయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఇది గత పదేళ్ళుగా కళ్లకు కనిపిస్తున్న దృశ్యం. పక్కనే ఉన్న తమిళనాడును యేలిన ఎంజీ.రామచంద్రన్ (ఎంజీఆర్) నుంచి మన రాష్ట్రాన్ని పాలించిన ఎన్టీఆర్‌లు రాజకీయల్లో తిరుగులేని నేతలుగా చెలామణి అయ్యారు. వారి తర్వాత సినీ రచయుత కరుణానిధి, అనాటి తార జయలలితలు ఇప్పటికీ.. తమిళనాట తమ | | ఈ ప్రజాభిమానం దేవుడిచ్చిన వరం. మనలో చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ప్రజాభిమానం ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుంది. ప్రజల అభిమానమే పెట్టుబడి. కొండంత అండ. --ఎన్టీఆర్. |
| |
ఛరిష్మాను కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాలకు పైగా నట జీవితాన్ని అనుభవించి, తెలుగునాట మెగాస్టార్‌గా అశేష అభిమాన అదరాభిమానాలు సొంతం చేసుకున్న నటుడు చిరంజీవి. ఈయన రాజకీయ రంగ ప్రవేశం మరోమారు 'తారల రాజకీయాలపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ తారా రాజకీయంపై ఓ కథనం...
మరో కొత్త శకానికి నాంది! రాజకీయాలు సినీ తారల జీవితాలకు షరా మాములైనా.. తెలుగునాట రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన మహా నటుడు దివంగత నందమూరి తారక రామారావు. ఆయన ద్వారానే ఆంధ్ర రాష్టంలో సినీ తారల రాజకీయ రంగ ప్రవేశాలకు పునాది పడింది. ఎన్‌టీఆర్‌కు ముందు 1967లోనే నటుడు కొంగర జగ్గయ్య కాంగ్రెస్ నుంచి ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలుపొందిన చరిత్ర ఉంది. ఈయన ప్రవేశం సినీ రంగంపై పెద్దగా ప్రభావం చూపలేదు.
|