ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > విష్‌ యు హ్యాపీ పాలిటిక్స్‌ టూ యూ....
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విష్‌ యు హ్యాపీ పాలిటిక్స్‌ టూ యూ....
FileFILE
ఆ తర్వాత జగ్గయ్య కోవలో ఆత్రేయ, జి.వరలక్ష్మి, మిక్కిలినేని, తాఫీ ధర్మారావు వంటి వారు వామపక్షాలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇక రాజకీయాల్లో రక్తకన్నీరుతో గుర్తింపు పొందిన నాగభూషణం ఏకంగా మంచి ఉపన్యాసకుడిగా గుర్తింపు పొందారు. వీరంతా రాజకీయాలకు సుపరిచితమే అయినా ఒక్కసారిగా తెలుగు రాజకీయాలను మలుపుతిప్పే ప్రక్షాళణ చేసింది ఎన్‌టి‌ఆర్ మాత్రమే. 'తెలుగు వారి ఆత్మగౌరవం' అనే నినాదంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయన ఆంధ్ర రాజకీయ చిత్రపటంపై సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు.

ఎన్టీఆర్ బాటలో మరెందరో..
ఎన్‌టిఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తారలెందరో ఉన్నారు. జమున, కృష్ణ, కృష్ణం రాజు, మోహన్ బాబు, శారద, సత్యనారాయణ, రామానాయుడు, సుబ్బిరామిరెడ్డి, హరికృష్ణ, కోట శ్రీనివాసరావు, జయప్రద, బాబుమోహన్, అశ్వనీదత్, మురళీమోహన్, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రమణ్యం, రోజా ఇలా చెప్పుకుంటూ పోతే.. గ్లామర్ నటుల జాబితా చాంతాండత ఉంటుంది. ఇందులో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాగా ఏ పదవీ దక్కక తీవ్ర నిరాశతతో వెనుదిరిగిన వారు ఉన్నారు.

తాజాగా.. మెగాస్టార్ రాజకీయ రంగ ప్రవేశం. ఈయన ప్రవేశం మెగా ఎంట్రీని తలపించింది. ఏళ్ళతరబడి ఉన్న పార్టీల పునాదులు సైతం కదిలించే స్థాయిలో చిరు రాజకీయ అరంగేట్రం జరిగింది. 'పదవులు వద్దు.. ప్రజాసేవే ముద్దు', 'రాజకీయ శత్రువులు లేరు.. దారిద్ర్యం, పేదరికమే నా ప్రధాన శత్రువులు', 'కలాం స్పూర్తి.. ఎన్టీఆర్ ప్రేరణ', 'చిరునవ్వుల ఆంధ్రప్రదేశ్.. సంతోషాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం' అనే నినాదాలతో ముందుకు వస్తున్న నటుడు మెగా 'మాస్టారు'.

చిత్తశుద్ది.. నిజాయితే పెట్టుబడిగా..
సినీ గ్లామర్ ఒక్కటే నటులను అందలమెక్కించదు. ప్రజల అవసరాలనూ తీర్చలేదు. కేవలం గ్లామర్‌ను చూసే ప్రజలు ఓట్లు వేయరు. ప్రజాసేవలో రాణించాలంటే.. చిత్తశుద్ధి, నిజాయితీలు ఎంతో ముఖ్యం. అలా ప్రజలకు చిత్తశుద్ధితో దగ్గరైతే అలాంటి నేతలకు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానమే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ నిజం చేసి చూపారు. రాజకీయాల్లోకి వచ్చిన తారల్లో అన్ని రకాల వాళ్ళున్నారు.
<< 1 | 2 | 3  >>  
మరిన్ని
'రంజు'గా మారిన రాష్ట్ర రాజకీయాలు  
తారక రాముని నామ స్మరణలో పార్టీలు  
రాజకీయ చట్రంలో చిరు నటిస్తారా? జీవిస్తారా?  
మెగా 'పంచ్' లైన్స్  
చిరంజీవి 'మెగా' రాజకీయ చరిత్ర సృష్టిస్తారా...!?