కొదరు డబ్బు కోసమైతే, మరికొందరు పదవుల కోసం, పాత చిక్కులను తప్పించుకోవటం కోసం, కొత్త పరిచయాల కోసం అవసరాన్ని బట్టి మరికొందరు ఉన్నారు. వీరే కాకుండా ఏదో తపన, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వ్యవస్థను మార్చాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చే వారు మరికొందరు. అయితే వీరు రాజకీయ వ్యవస్థను మార్చటంలో అశక్తులమని తెలుసుకుని అక్కడ ఇమడలేక గోడకు కొట్టిన బంతిలా వెనక్కు వచ్చేస్తారు. ఈ జబితాలో దేవానంద్, అమితాబ్ బచ్చన్ ఉన్నారు.
'ఈ ప్రజాభిమానం దేవుడిచ్చిన వరం' అని ఎన్టీఆర్ కొన్ని వందలసార్లు ఉచ్ఛరించి ఉంటారు. నిజమే ఆ గ్లామర్, ఆకర్శణ ఒక వరమే. రాజకీయ నాయకులు పాతికేళ్ళ ప్రజాజీవితంలో సాధించలేని దాన్ని పాతికేళ్ళ హీరో అవలీలగా సొంతం చేసుకోగలడు. ఆ అభిమానం కలకాలం తమ వెంట ఉండాలంటే అందరికి సాధ్యం కాకపోవచ్చు.
కానీ, ఎన్‌టీఆర్ గ్రహించిన జీవిత సత్యాల్లో ఒకటైన.. చిత్తశుద్ది, నిజాయితీ ఉంటే ప్రజాభిమానం ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుంది. ఆ కోవలో అగ్రగణ్యులు మన ఎన్‌టీఆర్, పక్కింటి.. ఎంజీఆర్ (తమిళనాడు). అంతటి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు చిరంజీవి. ఈయన రాజకీయ ప్రవేశాన్ని ప్రేక్షక దేవుళ్లు, ప్రజలు మనసారా అంగీకరిస్తే.. మరో చరిత్ర పునరావృత్తం కావడం తథ్యం. సో... విష్ యు హ్యాపీ పొలిటిక్స్ టూ యూ.. చిరు. గుడ్ లక్. |