| | చిరంజీవికి రాజకీయ అనుభవం లేదు.... ఆయన ఏమి చేయగలుగుతారు.... అంటున్నారు. ఇంతవరకూ సినిమా హీరోగానే నన్ను చూశారు. నాణెనికి ఒకవైపు ఉన్న చిరంజీవిని చూశారు. ఇకపై నాణెనికి రెండో వైపు ఉన్న చిరంజీవిని చూస్తారు. |
| |
మృధు స్వబావి... సున్నిత మనస్కుడు... ఈయన రాజకీయాల్లో తట్టుకోగలుగుతాడా... అనే విషయాలకు మంగళవారం నాటి పార్టీ ఆవిర్భావ సభ నుంచి స్పష్టమైన సమాధానం చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు తానంటే ఏమిటో చూపిస్తానని నేరుగానే ఘాటైన సమాధానం చెప్పారు. రాజకీయ పరిశీలకులకు ఇప్పటికే చిరంజీవి ధోరణి ఏమిటో అవగతమై ఉంటుంది.
చాలా సాదాగా స్టేజీపైకి ఎక్కిన ఆయన తన ప్రసంగాన్ని చిన్నతనంలో తాను పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. కొద్ది నిమిషాలకే తనపై వచ్చిన వచ్చిన విమర్శలకు ఒకటి రెండు మాటలలోనే చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. తనలో ఇంతవరకు సినిమా నటుడిని మాత్రమే చూశారని పేర్కొన్నారు. అయితే ఇకపై రాజకీయాలలో తన సత్తా ఏమిటో చూపుతానని స్పష్టంగా చెప్పారు.
ఈ మాటలు చాలు ఆయన మనసు ఏమిటో తెలుసుకోవడానికి. పైగా అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే ఏ రాజకీయ పార్టీకైనా దడ పుట్టక తప్పదు. ఆ జనం చిరంజీవి మాటలు విన్న ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ అయినా ఆయనను అంత తేలికగా తీసుకోనక్కరలేదనే నిర్ణయానికి రావాల్సిందే.
|