ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > విశ్లేషణలు > "మెగా" ప్రణాళికలు ప్రత్యర్థుల్లో గుబులుపుట్టిస్తున్నాయా..?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"మెగా" ప్రణాళికలు ప్రత్యర్థుల్లో గుబులుపుట్టిస్తున్నాయా..?
ప్రజారాజ్యం పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే ధీటైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం కూడా కీలకం. అంతేకాకుండా వీటిలో అన్నిసామాజిక వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించడం అవసరం. అయితే ప్రణాళికలతోనే గద్దె ఎక్కడం సాధ్యమా..? అంటే కచ్చితంగా చెప్పడం కష్టమే. గంజి తెలుసు బెంజి తెలుసు.. అని చెబుతున్న చిరంజీవి ఎదుట ప్రణాళిక రచనలకు మించిన పెనుసవాళ్లు చాలా ఉన్నాయి.

అవినీతిపై తన యుద్ధం అని ప్రకటించిన చిరంజీవి.. దానికోసం ఏంచేస్తారో చెప్పనేలేదని సభ ముగిసిన సాయంత్రం నుంచే విమర్శకులు తమ వాదనలను గుప్పించారు. చిరు ఇప్పటివరకు మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీలపై ఇటువంటి విమర్శలు అనేకం వచ్చాయి. వీటన్నింటికీ ఆయన ఏం సమధానం చెబుతారో.. వేచి చూడాల్సిందే. అయితే రాజకీయ ప్రవేశం విషయంలో చిరంజీవికి దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు తమ అభినందనలు తెలిపారు. అందులో భాజపా అగ్రనేత ఎల్ కె అద్వానీ నుంచి ఎస్పీ నేత అమర్ సింగ్ వరకూ ఉన్నారు.

ఇక చిరంజీవి ఎదుట ఉన్న సవాళ్లలో కొన్నింటిని పరిశీలిస్తే... తొలుత వచ్చేది ప్రత్యేక తెలంగాణా అంశం. కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రణబ్ కమిటీ వేసినా అది ఎందుకు ఉపయోగపడలేదు. దీంతో ఆగ్రహానికి గురైన తెరాస పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగారు. ఇదిలా ఉంటే, ఈ విషయంలో ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటామని, నిపుణుల సలహాల ప్రకారం వెళతామని చిరంజీవి చెప్పారు. అయితే ఎంతోకాలం ఇదే సమాధానంతో సరిపెట్టలేరు. ఎందుకంటే ఇదే సమాధానాలు చెప్పిన తెలుగుదేశం పార్టీ, కీలకమైన పార్టీ నేతలను దూరం చేసుకొని అందుకు మూల్యం చెల్లించుకోక తప్పలేదు.

తర్వాతది చిరంజీవికి సినిమా రంగం నుంచే ఎదురుకానుంది. చిరంజీవి రాజకీయ రంగప్రవేశానికి ముందుగానే సినీపరిశ్రమలో ప్రముఖులు కొందరు... టీడీపీకి మద్దతు తెలిపి, ఆ పార్టీ తరపున ప్రచారానికి కూడా సిద్ధమని ప్రకటించారు. మరి కొందరు కాంగ్రెస్‌తో జత కట్టారు. ఇంకొంతమంది అదను చూసి "అటా"... "ఇటా" అన్నట్లు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ప్రిన్స్ మహేష్‌బాబుకు కాంగ్రెస్ ఇప్పటికే ఎరవేసినట్లు వస్తున్న వార్తలు మనం వింటున్నవే.
<< 1 | 2 | 3  >>  
మరిన్ని
'మెగా' చర్చకు దారితీసిన 'బాబు' విమర్శలు
ప్రజారాజ్యం "మెగా" నేతకు వివాదాల సెగ
'ప్రజారాజ్యం' చుట్టూ తెలుగు రాజకీయం
ఢిల్లీ చేరిన 'ప్రజారాజ్యం' పంచాయతీ
రాజకీయ పార్టీలకు 'మెగా' ఛాలెంజ్
విష్‌ యు హ్యాపీ పాలిటిక్స్‌ టూ యూ....